మంచు విష్ణు - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `డి అండ్ డి` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఢీ కి సీక్వెల్ ఇది. ఇందులో హీరోయిన్ గా కోమలిని ఎంచుకున్నట్టు టాక్. కోమలి అంటే... ఎవరో కాదు. చాలా కాలం క్రితం.. టీవీ 9లో ఇద్దరు బుజ్జి పాపలు యాంకరింగ్ చేసేవారు. `కోమలి సిస్టర్స్` అనే కార్యక్రమంలో వీరిద్దరూ యాంకర్లు. ఆ షో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కోమలి సిస్టర్స్ లో కోమలినే హీరోయిన్ గా మారబోతోందన్నమాట.
కోమలికి ఇదే తొలి తెలుగు సినిమా. తమిళంలో ఇది వరకు ఓ సినిమా చేసింది. కోమలితో పాటు మరో కథానాయిక కూడా ఈ సినిమాలో నటించనుందని టాక్. ప్రగ్యా జైస్వాల్, అను ఇమ్మానియేల్ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీళ్లతో పాటు జెనీలియా.... అతిథి పాత్రలో కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే హీరోయిన్ ని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.