ఇటీవలే చిత్రసీమపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కరెంటు బిల్లులు రద్దు చేస్తామని, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామని, 10 కోట్లలోపు రూపొందించే చిన్న సినిమాలకు జీఎస్‌టీలో మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. దాంతో.. చిత్రసీమ సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది.
అయితే.. ఇప్పుడు జగన్ కూడా ఇలాంటి వరాలే ఇవ్వాలన్నది చిత్రసీమ ఆశ, ఆకాంక్ష. ఎందుకంటే.. రాష్ట్రాలు రెండుగా విడిపోయినా, సినిమా పరిశ్రమ మాత్రం ఒక్కటిగానే ఉంది. తెలుగు రాష్ట్రాలు రెండూ.. చిత్రసీమకు రెండు కళ్లు. ఒక రాష్ట్రంలో ఒక రూలు, మరో రాష్ట్రంలో మరో రూలు ఉండే పరిస్థితి లేదు. కరెంటు బిల్లుల విషయంలో మినహాయింపు, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం, జీఎస్‌టీ రద్దు.... ఇవ్వన్నీ ఏపీలోనూ దక్కాలని భావిస్తున్నారు. అప్పుడే టాలీవుడ్ ఓ అడుగు ముందుకు వేయడానికి ఆస్కారం ఉంటుంది. కేసీఆర్ వరాలు ప్రకటించినా, ఇప్పటికిప్పుడు సినిమాల్ని విడుదల చేసుకోలేరు. ఎందుకంటే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఏమిటో తెలియాలి. జగన్‌ప్రభుత్వం టాలీవుడ్ కి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడే.. చిత్రసీమ మళ్లీ కళకళలాడుతుంది. ఈ విషయమై చిత్రసీమ పెద్దలు త్వరలోనే జగన్‌ని కలుసుకునే అవకాశం ఉంది.