ప్రముఖ యాంకర్ ప్రదీప్ మద్యం తాగి కారు నడుపుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకి దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే, ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నెం 45 దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలిసుల చెక్ పోస్ట్ వద్ద ప్రదీప్ కి పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు గుర్తించారు. అయితే ఆ టెస్ట్ లో ఏకంగా 178 పాయింట్లు చూపెట్టింది. అసలైతే నిబంధనల ప్రకారం, 35 పాయింట్లు నమోదు అయితేనే ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ఆ వాహనదారుడికి చలాన్ అందచేస్తారు.
అటువంటిది ప్రదీప్ టెస్ట్ లో పాయింట్స్ ఎక్కువగా చూపెట్టడంతో కొత్త ట్రాఫిక్ నిబందనల ప్రకారం ఆయనకీ జైలు శిక్ష పడుతుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే డ్రంక్ & డ్రైవ్ కింద పలువురు సెలబ్రిటీలు దొరికిన సందర్బాలు ఉన్నాయి అయితే ఇంతమోత్తంలో మధ్య సేవించినట్టుగా పట్టుబడింది ప్రదీప్ మాత్రమే.
ప్రస్తుతానికి ఆయన కారుని వెంటనే సీజ్ చేసి బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కి తరలించగా, ఆయన పై ట్రాఫిక్ నిబందనల కేసు నమోదు చేశారు అధికారులు. ఇక ఆయనకీ ఎటువంటి శిక్ష పడుతుంది అన్న చర్చ ఇప్పుడు అందరిలోను మొదలైంది.
ఏదేమైనా.. యాంకర్ ప్రదీప్ కి ఈ కొత్త సంవత్సరం కొద్దిగా వివాదంతోనే మొదలైంది అని చెప్పాలి.