కరోనా ఎవరినీ వదలడం లేదు. అందరికీ సినిమా చూపించేస్తోంది. సినీ సెలబ్రెటీలు వరుసగా కరోనా బారీన పడుతున్నారు. ఇప్పుడు బుల్లి తెర స్టార్లకూ కరోనా వ్యాపిస్తోంది. తాజాగా యాంకర్ ప్రదీప్ .... కరోనా బారీన పడినట్టు తెలుస్తోంది. బుల్లి తెరపై ప్రదీప్ ఓస్టార్. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఓకే అనిపించుకోవడంతో.. హీరోగా తనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
ఇప్పుడు టీవీ షోలతో యమ బిజీ. వరుస షోతో బిజీగా ఉందే ప్రదీప్‌కు ఇటీవల కొద్దిగా అలసటగా ఉండడంతో పాటు కోవిడ్ లక్షణాలు కనిపించాయట. వెంటనే పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు సమాచారం. ప్రదీప్ కోవిడ్ బారిన పడిన నేపథ్యంలోనే యాంకర్ రవి ఆయన హోస్ట్ చేసే షోకు వ్యాఖ్యాతగా వెళ్లినట్టు సమాచారం.