నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం `వైల్డ్ డాగ్`. రొటీన్ కి భిన్నంగా సాగే కథ ఇది. ఓ ఉగ్రవాద సంస్థ నాయకుడ్ని పట్టుకోవడానికి ఎన్.ఐ.ఏ అధికారి చేసే ప్రయత్నమే కథ. థియేటర్లో విడుదలైన ఈ సినిమాని అప్పట్లో పెద్ద స్పందనేం రాలేదు. మంచి సినిమా అని గుర్తింపు వచ్చినా, చిరంజీవి లాంటి హీరోలు ట్వీట్ చేసినా, థియేటర్లో జనం లేక... వసూళ్లు రాలేదు. ఆఖరికి పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాల టాక్. ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల బిజినెస్ జరిపినా, కనీసం 3 కోట్లు కూడా రాబట్టలేకపోయింది.
అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లో చూడనివాళ్లంతా.. నెట్ ఫిక్స్‌లో ఈ సినిమాని బాగానే ఆదరిస్తున్నారు. తొలి రోజే.. వీక్షణల పరంగా సౌత్ ఇండియన్ రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేసినట్టు సమాచారం. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అవ్వడం ప్లస్ పాయింట్ అయ్యింది. ఆయా భాషల్లోనూ ఈ సినిమాని జనం ఆదరిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయినా, ఓటీటీలో మాత్రం హిట్టయినట్టే. ఓ రకంగా వైల్డ్ డాగ్ టీమ్ కి ఇది రిలీఫ్ అనకోవొచ్చు.