స్ట్రీట్‌ డాగ్స్‌పై రష్మి ఆవేదన చూశారా?

మరిన్ని వార్తలు

కరోనా కారణంగా ప్రజలం తా ఇళ్లకే పరిమితమైపోవడంతో, వీధి జంతువులకు తిండి దొరకడం లేదు. పాపం స్ట్రీట్‌ డాగ్స్‌ అయితే, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర హాట్‌ యాంకర్‌ రష్మి సోషల్‌ మీడియాలో ఓ వీడియోని పోస్ట్‌ చేస్తూ, మనం రోజుకు మూడు పూటలా భోజనం చేస్తున్నాం. మరో రెండు సార్లు స్నాక్స్‌ కూడా లాగించేస్తున్నాం. కానీ, స్ట్రీట్‌ డాగ్స్‌ అలా కాదు, రోజులో కనీసం ఒక్కసారి కడుపు నింపుకున్నా చాలు. కానీ ఆ ఒక్క పూట కూడా వాటికీ తిండి దొరకడం లేదు.. ఈ కరోనా టైమ్‌లో వాటి కష్టం తెలుసుకుని, వాటికి తిండి పెట్టే ప్రయత్నం చేయమని రష్మి సూచిస్తోంది.

 

తనవంతుగా కొన్ని స్ట్రీట్‌ డాగ్స్‌కి ఫుడ్‌ అందిస్తూ జంతవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటోంది. ఇకపోతే, రష్మి పోస్ట్‌ చేసిన వీడియోలో ఓ కుక్క తాను కష్టపడి తెచ్చుకున్న ఆహారాన్ని ఓ చోట భద్రపరచుకునే దృశ్యం హృదయ విదారకంగా కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది రష్మి. కరోనా కారణంగా బయటి ఫుడ్‌ని విచ్చల విడిగా తిని పాడేసే వారు తక్కువయిపోయారు. దాంతో, అలా వాడి పడేసిన ఆహార పదార్ధాల్ని తిని పొట్ట పోసుకునే ఈ వీధి కుక్కలకు ఆహారం దొరక్కుండా పోయింది. అందుకే కాస్త పెద్ద మనసు చేసుకుని, వీధి కుక్కల పట్ల మానవత్వం చూపించమంటూ రష్మి కోరుకుంటోంది. అయితే, ఈ మెసేజ్‌ని నెటిజన్స్‌ ఎలా తీసుకుంటారో ఏమో కానీ, ఈ విషయమై కాస్త ఆలోచించాల్సిందే సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS