ర‌వి సీరియ‌స్ రియాక్ష‌న్‌.... ద‌డ పుట్టించ‌డానికి రెడీ!

మరిన్ని వార్తలు

సోష‌ల్ మీడియాలో ఎంత మంచి ఉందో, అంతే చెడు ఉంది. ఎవ‌రికి తోచింది, వాళ్లు కామెంట్ చేసే స్వేచ్ఛ చాలాసార్లు మితిమీరుతోంది. దాంతో కొంత‌మంది సెల‌బ్రెటీలు హ‌ర్ట్ అవుతున్నారు. ట్రోలింగ్ అన్న‌ది సోష‌ల్ మీడియాలో చాలా సాధార‌ణ‌మైన విష‌య‌మైపోయింది. అయితే అది మితిమీరి... సెల‌బ్రెటీల కుటుంబ స‌భ్యుల్ని అందులోకి లాగుతున్నారు. అస‌లు సంబంధ‌మే లేని వ్య‌క్తుల్ని సోష‌ల్ మీడియాలోకి లాగి.. ట్రోల్ చేయ‌డం దారుణ‌మైన విష‌యం. ఇదే ప‌రిస్థితి.. యాంక‌ర్‌, బిగ్ బాస్ కంటెస్టెంట్ ర‌వికి ఎదురైంది.

 

ర‌వి బిగ్ బాస్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌పై చాలా ట్రోలింగ్ జ‌రిగింది. ప్ర‌తీ కంటెస్టెంట్ కీ ఫ్యాన్స్ తో పాటు...నెగిటీవ్ ఫ్యాన్స్ ఉండ‌డం స‌హ‌జం. అందులో భాగంగానే ఈ ట్రోలింగ్ జ‌రిగింద‌నుకోవ‌చ్చు. అయితే కొంత‌మంది మాత్రం హ‌ద్దు దాటి ప్ర‌వ‌ర్తించారు. ర‌వి భార్య‌, పిల్ల‌ల్ని ఈ ట్రోలింగ్ లోకి తీసుకొచ్చారు. దాంతో అప్ప‌ట్లో ర‌వి భార్య బాగా హ‌ర్ట‌య్యింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ర‌వి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. త‌న‌ని, త‌న కుటుంబాన్ని ట్రోలింగ్ చేసిన‌వాళ్ల‌పై రివైంజ్ తీర్చుకోవాల‌ని ఫిక్స‌య్యాడు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై, త‌న కుటుంబ స‌భ్యుల‌పై దారుణంగా ట్రోల్ చేసిన‌వాళ్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌పై అస‌త్య వార్త‌ల్ని ప్ర‌చారం చేసిన యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌పై కూడా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా పోలీసుల‌కు అప్ప‌గించాడు. ఇక‌పై.. సోష‌ల్ మీడియాలో నెగిటీవ్ కామెంట్లు పోస్ట్ చేసేవాళ్లంద‌రికీ... ద‌డ పుట్టాలి... ఈ చెత్త‌ను క్లీన్ చేయాలి.. అని సోష‌ల్ మీడియా వేదిక‌పై.. ర‌వి పిలుపునిచ్చాడు. ఇక నెగిటీవ్ ట్రోలింగ్ కి పాల్ప‌డిన వాళ్లంద‌రికీ దడ పుట్టడం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS