ఓ తరాన్ని శాశించిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ. ఎవరి స్టైల్ వాళ్లదే. ఎవరి అభిమానగణం వాళ్లదే. ఓ దశలో ఇద్దరి మధ్యా విపరీతమైన పోటీ నడిచేది. నువ్వా... నేనా? అంటూ బాక్సాఫీసు దగ్గర తలపడేవారు. కాకపోతే... ఆ పోటీ తెర వరకే. బయట... ఇద్దరూ మంచి మిత్రులు. ఈ విషయాన్ని అటు చిరు, ఇటు బాలయ్య చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ... ఇద్దరూ కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు. ఇప్పుడు ఈ అరుదైన కాంబో సెట్ కాబోతోందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
మైత్రీ మూవీస్ దగ్గర ఓ కథ ఉంది. అది మల్టీస్టారర్ కేటరిగికి సంబంధించిన కథ. ఆ కథ చిరు, బాలయ్యలకు పర్ఫెక్ట్ గా కుదురుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే బాలయ్యని, చిరుని కలిసి.. ఈ సినిమా కోసం ఒప్పించే ప్రయత్నాలు చేయబోతున్నారని తెలుస్తోంది. చిరు, బాలయ్య కలిస్తే ఇంకేమైనా ఉందా.. అది అరాచకమే. బాక్సాఫీసుకు పూనకాలు వచ్చేస్తాయి. మల్టీస్టారర్ చిత్రాలకు సిద్ధమని బాలయ్య ఎప్పుడో ప్రకటించేశాడు. చిరు కూడా ఇప్పుడు ఎవరు సినిమా చేయమని అడిగినా కాదనడం లేదు. సో.. ఈ కాంబో దాదాపుగా ఖాయమైనట్టే.