జబర్‌దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలా? అని మల్లెమాల మల్లగుల్లాలు పడింది. రకరకాల ఆప్షన్లు ప్రయత్నించింది. చివరికి ఓ కొత్తందాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తనే సౌమ్యా రావు. కన్నడ సీమకు చెందిన సౌమ్య.. తెలుగువారికి పరిచయమే. ఈటీవీలో `శ్రీమంతుడు` సీరియల్ తో పాపులర్ అయ్యింది. తను నటించిన కొన్ని కన్నడ సీరియల్స్ తెలుగులో డబ్ అయ్యాయి. ఇటీవల ఈటీవీలో ప్రదర్శితమైన ఓ కామెడీ షోలో కూడా తాను కనిపించింది. ఆ షో.. హిట్టయ్యేసరికి మల్లెమలా దృష్టి సౌమ్య రావుపై పడింది. అందుకే జబర్‌దస్త్ లో ఆమెను తీసుకోవాలని ఫిక్సయిపోయారు.
ఈ షో కోసం.. సౌమ్యకు ఒకొక్క ఎపిసోడ్ కీ రూ.30 వేల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. ఇది వరకు అనసూయ ఒక్కో రోజు షూటింగ్ కి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకూ అందుకొందని సమాచారం. ఆమెతో పోలిస్తే.. సౌమ్య కొంచెం చీప్ గా వచ్చేసినట్టే. ఈ షో తో సౌమ్య పాపులర్ అయితే... మెల్లమెల్లగా.. తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. సౌమ్య చలాకీ అమ్మాయే. పైగా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. సో... జబర్‌దస్త్ వీక్షకులకు ఇక పండగే.