టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిఖిల్ పెళ్లయిపోయింది. నితిన్, రానా పెళ్లికి రెడీ అయ్యారు. కొంతమంది హీరోయిన్ల దృష్టీ పెళ్లిపై పడింది. యాంకర్ భామలు సైతం పెళ్లికి తయ్యార్ అవుతున్నారు. తాజాగా శ్రీముఖి పెళ్లిపై రకరకాల వార్తలొచ్చాయి. తను ఓ నటుడితో డేటింగ్ చేస్తోందని, తననే పెళ్లి చేసుకుంటుందని గుసగుసలు వినిపించాయి. దీనిపై క్లారిటీ ఇచ్చేసింది శ్రీముఖి. తాను ఎవ్వరితోనూ ప్రేమలో పడలేదని, డేటింగ్లూ చేయడం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి సింగిలే అని తేల్చేసింది. ఇంట్లోవాళ్లు ఓకే చేసిన అబ్బాయితోనే తన పెళ్లి జరుగుతుందని, అయితే ప్రస్తుతానికి పెళ్లి విషయంలో తొందరేం లేదని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో కొన్ని స్క్రిప్టులు తయారు చేశానని, మళ్లీ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది ఈ హాట్ యాంకర్ భామ. సో.. శ్రీముఖి పెళ్లిపై వచ్చిన వార్తలన్నీ రూమర్లే అన్నమాట.