నితిన్ కూడా ఆగ‌లేక‌పోతున్నాడ‌ట‌!

మరిన్ని వార్తలు

లాక్ డౌన్ వ‌ల్ల చాలా చిక్కులొచ్చి ప‌డ్డాయి. పెళ్లి చేసుకుని, జీవితంలో సెటిల్ అయిపోదామ‌ని చూసిన బ్ర‌హ్మ‌చారుల‌కూ లాక్ డౌన్ క‌ష్టాలు వెంటాడుతున్నాయి. పెళ్లిళ్లు ఆగిపోయి.. ఇంకా బ్ర‌హ్మ‌చారులుగానే బ‌తుకుతున్నారు. నిఖిల్ లాంటి వాళ్లు లాక్ డౌన్ లోనూ పెళ్లిళ్లు చేసుకుని అలాంటివాళ్లంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు నితిన్ కూడా నిఖిల్ బాట‌లోనే న‌డుస్తున్నాడు. అన్నీ స‌వ్యంగా ఉంటే.. ఈపాటికి నితిన్ ఓ ఇంటివాడ‌య్యేవాడు.

 

లాక్ డౌన్ వ‌ల్ల త‌న పెళ్లి వాయిదా ప‌డింది. షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు నితిన్‌. ఏప్రిల్ 15న వీళ్ల పెళ్లి జ‌ర‌గాల్సింది. కానీ లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయింది. ఈ క‌రోనా క‌ష్టాలు త‌గ్గి, మ‌ళ్లీ జ‌న జీవనం మామూలు అయ్యేంత వ‌ర‌కూ ఆగాల‌ని ఇద్ద‌రూ ఫిక్స‌య్యారు. కానీ... ఎన్నాళ్ల‌కీ ఈ లాక్‌డౌన్ కష్టాలు తీర‌కపోయే స‌రికి... ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని నితిన్ భావిస్తున్న‌ట్టు టాక్‌. నిఖిల్ లా... నితిన్ కూడా సింపుల్ మ్యారేజ్‌కి మెగ్గుచూపుతున్నాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కొత్త ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తార్ట‌.

 

ఏంటో ఈ క‌రోనా వ‌ల్ల స్టార్ల పెళ్లిళ్లు ఇంత సింపుల్ గా జ‌రిగిపోతున్నాయి. మ‌రి రానా పెళ్లి మేట‌రేంటో? తానూ ఇటీవ‌లే నిశ్చితార్థం చేసుకున్నాడుగా. డిసెంబ‌రులో పెళ్ల‌ని వార్త‌. అప్ప‌టి వ‌ర‌కూ ఆగుతారో, లేదంటే.. ఇలానే సింపుల్ గా కానిచ్చేస్తారో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS