ప్రముఖ పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన కరోనాతో బాధ పడుతూ... కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. టీఎన్నార్ పూర్తి పేరు.. తుమ్మల నరసింహా రెడ్డి. ఫ్రాంక్లీ స్పీక్ విత్ టిఎన్నార్ పేరుతో సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. ఆ కార్యక్రమంతోనే ఆయన బాగా పాపులర్ అయ్యారు. నటుడిగా దాదాపు 50 సినిమాల్లో నటించారు.
దర్శకుడు అవ్వాలన్నది ఆయన కోరిక. ఓ కథ కూడా సిద్ధం చేసుకుని, త్వరలోనే మెగా ఫోన్ పట్టాలనుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకింది. అలా.. తనకీ కోవిడ్ అంటుకుంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. అయితే... పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. టీఎన్నార్ మృతి పట్ల టాలీవుడ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది.