వెండి తెరపై హీరోల ఆధిపత్యమే ఎక్కువ. కథానాయికలు ప్రయోగాలు చేసేంత సీన్ లేదు. ఉన్నా.. ఆ అవకాశం స్టార్ హీరోయిన్లకే వస్తుంది. పాత్ర డిమాండ్ చేస్తే.. ఎలా కనిపించడానికైనా హీరోయిన్లు సిద్ధంగా ఉంటారు. కానీ అలాంటి అవకాశం కూడా అతి కొద్దిమందికే దక్కుతుంది. తాజాగా.. ఆండ్రియా ఓ సాహసం చేయబోతోందట. ఓ సినిమా కోసం నగ్నంగా కనిపించబోతోందట. అందుకోసం రెట్టింపు పారితోషికం డిమాండ్ చేసిందని, నిర్మాతలు కూడా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఒప్పుకున్నారని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.... తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `పిశాసి`. తెలుగులో `పిశాచి`గా విడుదలైంది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తయారవుతోంది. అందులో ఆండ్రియా కీలక పాత్రధారి. ఈసినిమాలోని ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా కనిపించాల్సివచ్చిందట. ఆ సన్నివేశంలో నటించడానికి ఆండ్రియా ముందు తటపటాయించినా, నిర్మాతలు బలవంతం చేయడంతో ఒప్పుకుందట. అందుకు గానూ.. రెట్టింపు పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, ఈ సీన్ తీసేటప్పుడు సెట్లో ఒకరిద్దరు మాత్రమే ఉండాలని షరతు విధించిందని తెలుస్తోంది. ఆండ్రియా విజ్ఞప్తి మేరకే.. ఈ సీన్ తీస్తున్నప్పుడు సెట్లో దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే ఉండేలా జాగ్రత్త పడ్డార్ట. ఈ సీన్... సినిమాకే హైటెట్ గా నిలుస్తుందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఆండ్రియా ఈ సీన్‌లో ఎంతలా రెచ్చిపోయిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.