సూపర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో ఆండ్రియా

మరిన్ని వార్తలు

క్రైమ్‌ థ్రిల్లర్స్‌లో నటించేందుకు ఇప్పుడు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నారు. రెగ్యులర్‌ కమర్షియల్‌ స్టోరీస్‌లో గ్లామర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. కానీ ఇలాంటి స్పెషల్‌ కాన్సెప్ట్‌ చిత్రాల్లో యాక్టింగ్‌ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అందాల భామలు, తమ అందంతో పాటు, టాలెంట్‌నీ ట్యూన్‌ చేస్తున్నారు ఈ తరహా మూవీస్‌తో. 

ఈ మధ్య తెలుగులో సిద్దార్ద్‌ హీరోగా వచ్చిన 'గృహం' సినిమాలో సూపర్‌ హాట్‌గా ఇంచుమించు బోల్డ్‌గా నటించేసిన బ్యూటీ ఆండ్రియా. లేటెస్టుగా మరో హారర్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 'కా' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ కావడంతో, అమ్మడు మరీ పండగ చేసుకుంటోందట. నాంజిల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. షాలోం స్టూడియోస్‌ బ్యానర్‌లో జాన్‌ మేక్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆండ్రియా వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా కనిపించనుంది. గతంలోనూ ఆండ్రియా పలు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌లో నటించింది. 

అయితే ఈ సినిమా కథ ఆమెని ఎంతో బాగా ఇంప్రెస్‌ చేసిందట. అందుకే కొత్త దర్శకుడు అని చూడకుండా, వెంటనే సినిమాకి ఓకే చెప్పేసిందట. అంతేకాదు, ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయట. ఒక్కొక్కటిగా తానే రివీల్‌ చేస్తానంటోంది ఆండ్రియా. తెలుగులో 'తడాఖా' చిత్రంలో సునీల్‌కి జోడీగా నటించింది ఆండ్రియా. నటి మాత్రమే కాదు, గాయని కూడా. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'భరత్‌ అనే నేను' చిత్రంలో ఆండ్రియా పాట పాడిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS