చివ‌రికి ఈ టైటిలే సెట్ట‌య్యింది

By iQlikMovies - April 28, 2018 - 20:49 PM IST

మరిన్ని వార్తలు

క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కథానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ ఏంట‌న్న విష‌యంలో చాలా రోజులుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఈలోగా చాలా టైటిళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయ్ కూడా. దేవుడు మ‌ర‌మందిస్తే, 'తేజూ ఐ ల‌వ్ యూ'... ఇలా ర‌క‌ర‌కాల టైటిళ్లు అనుకున్నారు. చిత్ర‌బృందం మాత్రం వాట‌న్నింటినీ ఖండిస్తూ వ‌చ్చింది. చివ‌రికి ఇప్పుడు వాటిలోనే ఓ టైటిల్ ఫిక్స్ చేసింది.

ఈ సినిమాకి తేజూ ఐ ల‌వ్ యూ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ఆ టైటిల్ కాదు' అంటూనే ఇప్పుడు అధికారికంగా అదే టైటిల్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈచిత్రానికి కె.ఎస్‌.రామారావు నిర్మాత‌. జూన్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS