నో లిప్‌లాక్స్‌ బట్‌ కండిషన్స్‌ అప్లయ్‌.!

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ ఆండ్రియా ఇంపార్టెంట్‌ రోల్స్‌తో పాటు, బోల్డ్‌గా కనిపించడానికైనా వెనుకాడదన్న సంగతి తెలిసిందే. పలు చిత్రాల్లో ఆమె బోల్డ్‌ సన్నివేశాల్లో నటించి యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసింది. అయితే ఎందుకో ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకుందట. బోల్డ్‌ పాత్రలు పోషించనంటోంది. 

హుందా అయిన పాత్రల కోసమే తనను సంప్రదించాలని దర్శక, నిర్మాతలకు సంకేతాలు పంపిస్తోందట. అసలు ఆండ్రియాని సడెన్‌గా ఇలా మార్చేసిన సందర్భాలేంటో కానీ, అమ్మడు చేసిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇటీవలే విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన 'విశ్వరూపం 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేసింది. మొన్నామధ్య సిద్ధార్ద్‌ హీరోగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లో విడుదలైన 'గృహం' సినిమాలో విచ్చలవిడిగా అందాలారేసేసింది. అంతకన్నా ముందు సునీల్‌, నాగచైతన్య కాంబోలో వచ్చిన 'తడాఖా' చిత్రంలో సునీల్‌కి జంటగా డిగ్నిఫైడ్‌ రోల్‌ పోషించి, అందర్నీ మెప్పించింది. 

ఇలా విభిన్న పాత్రల్లో చక్కగా ఒదిగిపోగలదు ముద్దుగుమ్మ ఆండ్రియా. అయితే ఎందుకు ఇప్పుడు గ్లామర్‌ పాత్రలకు దూరమవుతానంటోంది అంటే, హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌పై ఆండ్రియా కన్నేసినట్లు తెలుస్తోంది. 'విశ్వరూపం 2'లో ఆమె యాక్షన్‌ విశ్వరూపం చూసిన పలువురు నిర్మాతలు ఆండ్రియాతో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ తెరకెక్కించాలని అనుకుంటున్నారట. సో ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఈ హాట్‌ బ్యూటీ ఈ హాట్‌ టాపిక్‌కి తెర లేపిందనీ కోలీవుడ్‌ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS