బిగ్ బాస్ ఇంటిలో ఒక్కొక్కరు చాలా ఎక్కువ రోజులు గడపడం వల్ల చాలా సహజంగా వారిమధ్య ఒక రిలేషన్ ఏర్పడిపోయింది. అయితే ఆ రిలేషన్ బిగ్ బాస్ బయట కూడా కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది.
తాజాగా దీనికి సంబంధించిన ఒక సంఘటన జరిగింది. బిగ్ బాస్ ఇంటిలో అత్యంత ఎక్కువ అదే సమయంలో తక్కువ వయసు వారైన బాబు గోగినేని & దీప్తి సునైన మధ్య చాలా చక్కటి అనుబంధం ఏర్పడింది. బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయే సందర్భంలో కూడా దీప్తి సునైనా గురించి బాబు గోగినేని ప్రస్తావించడం జరిగింది.
వారిరువురు అక్క తమ్ముడు అంటూ పిలుచుకుంటూ ఉండడం చాలా చూడముచ్చటగా ఉంది. అందులో భాగంగానే నిన్న రాఖీ పండగ పురస్కరించుకుని బాబు గోగినేని ఇంటికి వెళ్ళి మరి ఆయనకి రాఖీ కట్టి వచ్చింది దీప్తి సునైనా.
దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. తనకోసం ఇంత దూరం వచ్చి మరి రాఖీ కట్టిన తన అక్కకి శుభాభినందనలు అంటూ బాబు గోగినేని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.