శంకర్‌ కోసం అప్పుడు అక్షయ్‌ ఇప్పుడు అనిల్‌!

మరిన్ని వార్తలు

క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ప్రస్తుతం 'ఇండియన్‌ 2' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌ రోల్‌ పోషిస్తున్న వ్యక్తి ఈయనే అంటూ హాట్‌ హాట్‌గా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన.? అంటే బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌. కమల్‌ హాసన్‌కి తగ్గ నటుడే అనుకుంటున్నారు కదా. అవునండీ అందుకే ఈ ప్రచారానికి అంత వేల్యూ దక్కుతోంది.

 

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ని 'రోబో 2.0'లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కోసం విలన్‌గా మార్చేశాడు శంకర్‌. ఇప్పుడు విశ్వనటుడు కమల్‌హాసన్‌ కోసం అనిల్‌ కుమార్‌కి విలన్‌ మాస్క్‌ వేసేయనున్నాడన్న మాట. సీనియర్‌ నటుడు అయినా, ఈయన బాలీవుడ్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌లో ఈయన్ని కొట్టేవారే లేరనుకోవాలి. వయసులో కుర్రహీరోలకు పోటీ పడుతుంటారు అనిల్‌ కపూర్‌. మొన్నీ మధ్యనే ఓ సినిమాలో అనిల్‌ కపూర్‌ తన తోటి యంగ్‌ హీరోస్‌తో కలిసి దిగిన ఫోటో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

ఫ్రెష్‌ అండ్‌ యంగ్‌ హీరోస్‌ కన్నా, అనిల్‌ కుమారే యంగ్‌గా కనిపిస్తున్నారంటూ ఆ ఫోటోని తెగ వైరల్‌ చేసేశారు నెటిజన్లు. అలాంటి ఈయన ఇప్పుడు శంకర్‌ సినిమాలో నటిస్తున్నాడంటే, ఆయన క్రేజ్‌ మరింత పెరిగే అవకాశాల్లేకపోలేదు. 'రోబో 2.0' మాదిరి 'ఇండియన్‌ 2' కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమానే. ప్రస్తుతం ఏపీలోనే ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరి అనిల్‌ కపూర్‌ పాత్రపై ఆడియన్స్‌కి క్లారిటీ రావాలంటే, 'ఇండియన్‌ 2' టీమ్‌ అఫీషియల్‌గా స్పందించాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS