కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 'సైరా' సినిమాని వీక్షించినందుకు ఆరుగురు ఎస్సైలపై వేటు వీఆర్ వేటు పడింది. ఈ రోజు 'సైరా' ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి 1 గంట నుండే ప్రభుత్వం అనుమతితో ఎక్స్‌ట్రా షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ తెల్లవారుజాము షోకి 'సైరా' సినిమాని చూసేందుకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉన్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, సినిమా చూసేందుకు వెళ్లారని ఎస్పీ ఫకీరప్ప వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారు. ముందూ వెనకా ఆలోచించకుండా, నిర్ధాక్షిణ్యంగా వారిని విధుల నుండి బహిష్కరించారు. ఇది నిజంగా దారుణమైన విషయమే.
పోలీసులు మనుషులు కాదా.? వారికీ అభిమానం ఉండదా.? అంత దారుణంగా బిహేవ్ చేసిన పై అధికారిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాపం ఆ ఎస్సైల పరిస్థితేంటీ.? ఈ న్యూస్ ఇప్పుడు అన్ని మీడియాల్లోనూ వైరల్ అవుతోంది. తమ ఉద్యోగాలు పోవడానికి 'సైరా' కారణమైందనే ఆలోచన ఆ ఎస్సైలు తట్టుకోలేకపోతున్నారు.