సినిమా హిట్ కావాలంటే కేవలం కంటెంట్, బడ్జెట్ మాత్రమే కాదు.. స్మార్ట్ ప్రమోషన్స్ కూడా కీలకం అనే విషయాన్ని మరోసారి నిరూపించారు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అనిల్, ఈ సినిమా ప్రచార విధానంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నెలకొల్పారు.
సాధారణంగా సినిమా ప్రమోషన్స్ విడుదలకు 2-3 వారాల ముందు ప్రారంభమవుతాయి. కానీ అనిల్ రావిపూడి ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేశారు. ట్రైలర్, సాంగ్స్ మాత్రమే కాకుండా, మేకింగ్ దశ నుంచే ఫన్నీ వీడియోలు, హైలైట్ సీన్లు విడుదల చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. రిలీజ్ సమయానికి సినిమాపై మాస్ - ఫ్యామిలీ ఆడియన్స్‌లో బజ్ మళ్లీ మళ్లీ పెంచుతూ వచ్చారు. సినిమా హిట్టయిన తర్వాత కూడా ప్రమోషన్లను నిలిపేయకుండా నెలరోజులపాటు కొనసాగించడం విశేషం.
అనిల్ రావిపూడి తీసిన ఈ ప్రమోషన్ రూట్‌ను ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ టీమ్ కూడా ఫాలో అవుతోంది. జి.వి. ప్రకాష్‌తో ఫన్నీ ప్రమోషనల్ స్టంట్స్, హీరో నితిన్‌ను లాక్ చేయడానికి చేసిన క్రియేటివ్ క్యాంపెయిన్, సెట్‌లోని హైలైట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ క్రేజ్ పెంచడం.. ఇవి చూస్తుంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్ స్ట్రాటజీనే గుర్తు చేస్తున్నాయి.
ఇప్పుడీ ట్రెండ్ మరింత విస్తరించబోతుంది. ‘రాబిన్ హుడ్’ కూడా హిట్టయితే, ఇకపై సింపుల్ ప్రమోషన్లకు ఫుల్‌స్టాప్ పడేలా ఉంది. అనిల్ రావిపూడి ఇప్పుడు సినిమా ప్రమోషన్ అంటే ఇదీ అనిపించేలా, యంగ్ డైరెక్టర్స్‌కు ఓ గైడ్‌లైన్ గా మారిపోయారు.