రజనీకాంత్ కూలీ తెలుగు రైట్స్‌కు భారీ డిమాండ్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగులో విపరీతమైన మార్కెట్ ఉంది. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రజనీ, ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్‌లో నిర్మాతల మధ్య హాట్‌ ఫైట్ మొదలైంది.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు, ఏషియన్ సునీల్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ ఈ రైట్స్ కోసం పోటీలో ఉన్నారు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ మూవీకి మంచి లాభాలు తెచ్చుకున్న నాగ వంశీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీల్ మిస్ అవ్వకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటివరకు రూ.40 కోట్ల వరకు ఈ రైట్స్‌కు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, మరికొందరు పోటీకి దిగితే ఈ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో వైజాగ్, హైదరాబాద్ లలో చివరి షెడ్యూల్ జరగనుంది.

సినిమా షూటింగ్‌ను మార్చి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ నెలలోనే ‘కూలీ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. అంచనాల ప్రకారం, ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS