టెంపర్‌లో... ఓ డైలాగ్ ఉంది. మీరు మారిపోయారు సార్.. అంటూ! ఇప్పుడు అనిల్ రావిపూడిని చైసినా ఇదే విషయం గుర్తొస్తోంది. ఆయన ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు.. భగవంత్ కేసరి సినిమా వేరనిపిస్తోంది.
చేసిన ప్రతి సినిమా విజయం సాధించడం మామూలు విషయం కాదు. చాలా కొద్దిమందికి ఇలాంటి ట్రాక్ రికార్డ్ సాధ్యమౌతుంది. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా వున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్లే. అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంటర్ టైమెంట్ గ్యారెంటీ అనే ముద్రపడింది. ఐతే అదే సమయంలో అనిల్ రావిపూడి సినిమా పై ‘రొటీన్’ అనే మాట కూడా వినిపించింది. నిజానికి ఆయన గత చిత్రం ఎఫ్ 3, ఎఫ్ 2 లాంటి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. అందులో పాత్రలు, సన్నివేశాలు రొటీన్ అయిపోయాయి. బఫూన్ కామెడీ అనే విమర్శ కూడా వచ్చింది.
ప్రతి దర్శకుడికి ఎదో దశలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం సహజమే. ఇలాంటి సమయంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ‘భగవంత్ కేసరి’తో అనిల్ రావిపూడి ఈ ప్రయత్నం చేసినట్లుగానే కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసిన జనాలు అంతా యునానిమస్ గా చెబుతున్న ఒక మాట..'కొత్తగా వుంది'. అటు బాలయ్యకి ఇటు అనిల్ రావిపూడికి ఇద్దరికి ఇది కొత్తదనే ఫీలింగ్ ని కలిగించింది ట్రైలర్.
అనిల్ రావిపూడి అంటే కమర్షియల్ పంచ్ లు వుంటాయి. గ్లామరస్ విజువల్స్ వుంటాయి. ఒక కామెడీ బ్యాచ్ వుంటుంది. ఇప్పుడీ సినిమా కోసం అవన్నీ ఎవైడ్ చేసినట్లుగానే కనిపిస్తుంది. బాలయ్యని సరికొత్తగా చూపించాడు అనిల్. నిజానికి బాలయ్యని ఈ మధ్య కాలంలో ఇంత సెటిల్డ్ ఎవ్వరూ ప్రజంట్ చేయలేదనే చెప్పాలి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లు లార్జ్ దెన్ లైఫ్ వున్న పాత్రలని పక్కన పెట్టి కాస్త రియలిస్టిక్ అప్రోచ్ లో సినిమాలు చేసి జైలర్ లాంటి విజయాలు కొడుతున్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ చూస్తుంటే కూడా.. బాలయ్య వయసు ఇమేజ్ కి తగ్గ కథ, పాత్ర అనిపిస్తోంది. అటు అనిల్ రావిపూడికి కూడా ఒక మార్పు అత్యవసరం. మొత్తానికి సరైన సమయంలో భగవంత్ కేసరిలో ఆ మార్పుని చూపించారు. మరి ఈ మార్పుని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.