చిరు - నాగ్ లతో అనిల్ మ్యాజిక్ చేయనున్నాడా?

మరిన్ని వార్తలు

అపజయం ఎరగని దర్శకుడు అనిల్ రావి పూడి. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో పొంగల్ బరిలో దిగుతున్నాడు. నెక్స్ట్ అనిల్ రావి పూడి మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేసాడు. చిరు కూడా ఓకే చెప్పాడని, త్వరలోనే పట్టాలెక్కుతోంది అన్న ప్రచారం జరిగింది. ముందు వెంకటేష్ తో, తరవాత బాలయ్యతో సినిమాలు చేసిన అనిల్ రావి పూడి నెక్స్ట్ చిరు, నాగ్ ల కోసం కథ రాసుకున్నాడని, చిరు మూవీ పూర్తి అయ్యాక అక్కినేని నాగార్జునతో కూడా ఒక సినిమా స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడీ స్టోరీ విష‌యంలో అనీల్ యూటర్న్ తీసుకున్న‌ట్లు ఫిలిం నగర్ టాక్.

చిరంజీవి కి ఏ కథ అయితే అనిల్ వినిపించాడో అదే కథ ఇద్దరితో కలిసి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. అదే కథని కొంచెం మార్పులు చేర్పులు చేసి మ‌ల్టీస్టారర్ గా మార్చే ఆలోచనలో ఉన్నాడట. ఈ మధ్య మల్టీ స్టారర్ జోరు పెరిగింది. బాలీవుడ్ లో ఎప్పటినుంచో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నా, సౌత్ లో తక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించటం చాలా అరుదు. జక్కన్న చెర్రీ, ఎన్టీఆర్ లతో RRR చేసారు. వెంకటేష్, మహేష్ కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ, నెక్స్ట్ వెంకటేష్ పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల', వెంకటేష్ వరుణ్ తేజ్ F2, F3 చేసారు.

ఇప్పడు అనిల్ ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేస్తున్నాడనవచ్చు. చిరు, నాగ్ ఒకే జనరేషన్ సూపర్ స్టార్స్. అలాంటిది వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ కిక్కే వేరు. నాగ్ ఇప్పటికే 'ఊపిరి', నిన్నే ప్రేమిస్తా, సంతోషం లాంటి మల్టీ స్టారర్ సినిమాలు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా రజనీ కాంత్ తో  'కూలి', ధనుష్ తో కుభేర చేస్తున్నారు. ఇప్పడు చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చిరు- నాగ్ మంచి దోస్తులు. వీరి మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. వీరి బాండింగ్ తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు అనిల్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS