వరసగా హిట్లు సాధిస్తూ దూసుకుపోతున్న అనిల్ రావిపూడి గత కొంతకాలంగా 'F3' స్క్రిప్టుపై పని చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరు హీరోలు వెంటనే అందుబాటులో లేకపోవడంతో నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని కూడా అన్నారు. అయితే ఇప్పడు అవన్నీ తూచ్ అయ్యాయట.
మరో నాలుగైదు నెలల పాటు కొత్త సినిమాలు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అనిల్ రావిపూడి దృష్టి వెబ్ సీరీస్ లపై పడిందట. అల్లు అరవింద్ గారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహ కోసం ఓ కామెడీ వెబ్ సీరీస్ ప్లాన్ చేయాలని ప్రపోజల్ రావడంతో అనిల్ రావిపూడి కూడా సరే అన్నారట. కొత్త సినిమా ప్రారంభించేందుకు ఎలాగూ సమయం పడుతుంది కాబట్టి అంతలోపు ఈ ఓటీటీల అంతు చూస్తే సరిపోతుందని, ఓ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ వెబ్ సీరీస్ కనుక తీసుకొస్తే మేలని డిసైడ్ అయ్యారట.
ప్రస్తుతం ఇదంతా చర్చల దశలో ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇలాగే థియేటర్లు తెరవకుండా మరో ఏడాది కొనసాగితే అందరూ ఓటీటీల బాట పడతారేమో మరి.