బిగ్ బాస్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ని నడిపించిన అనుభవం నాగార్జునకు ఉంది. పైగా `మా` టీవీతోనూ ఆయనకు లింకు ఉంది. పైగా బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణలోనే వేస్తారు. కాబట్టి నాగ్ ఎంట్రీపై ఎవరికీ ఎలాంటి అనుమనాలూ లేవు. అయితే ఇప్పుడు బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది. ఈ సీజన్ కి సమంత హోస్ట్ గా వ్యవహరిస్తుందని ప్రచారం మొదలైంది. సమంత వస్తే... ఆ గ్లామరే వేరుగా ఉంటుంది.
ఇప్పటి వరకూ వివిధ భాషల్లో బిగ్ బాస్ షోలు నిర్వహిస్తూ వచ్చారు. లేడీ హోస్ట్ ఎప్పుడూ కనిపించలేదు. సమంత ఓకే అయితే... ఆ ఘనత తెలుగు వెర్షన్‌కే దక్కుతుంది. అయితే సమంతకు అంత టైమ్ ఉందా అనేది అనుమానం. ఎందుకంటే సమంత సినిమాలతో బిజీగా ఉంది.వ్యక్తిగత జీవితానికీ సమయం కేటాయించాలనుకుంటోంది. ఈ తరుణంలో.. సమంత బిగ్ బాస్ 4 కి హోస్ట్ చేయడం సాధ్యమా? అనే సందేహాలు నెలకున్నాయి. సమంత ఓకే అంటే మాత్రం ఈ షోకి మరింత గ్లామర్ రావడం ఖాయం.