ఎఫ్ 2 సినిమా దర్శకుడు అనిల్ రావిపూడికి కామెడీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. పటాస్ , సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు .. ఈ నాలుగు సినిమాల్లో యాక్షన్ వుంటుంది. కానీ అందులో కామెడీనే హైలెట్ గా నిలిచింది. ఎఫ్ 2 కామెడీ బ్రాండ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. జంద్యాల, ఈవీవీ స్థానాన్ని అనిల్ భర్తీ చేస్తాడా ? అనే మాట కూడా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఐతే ఈ మాట అనిల్ దగ్గర ప్రస్తావిస్తే మాత్రం చాలా భిన్నమైన సమాధానం వచ్చింది.
''నేను మాస్ సినిమాలు చేయలానే వచ్చాను. అయితే కామెడీ ఉంటేనే నా సినిమా ఫుల్ ఫిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ .. ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ వుందో అంత కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా లార్జ్ స్కేల్ ఆడియన్స్ కి రీచ్ కావాలని ఎఫ్ 2 ని ఒక స్ట్రాటజీ ప్రకారం చేశాను. ఎఫ్ 2 ఓవర్సిస్ లో 2 మిలియన్ కొట్టింది. ఎక్కడ ఖాళీ వుందో చూస్తూ సినిమాలు చేయాలి. ఎఫ్ 2తో ఒక కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచూసుకోవడానికి సరిలేరు నీకెవ్వరు లూ ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకున్నాం. సరిలేరు నీకెవ్వరు ఫల్ యాక్షన్ మాస్ సినిమా. ఇప్పుడు ఎఫ్ 3తో మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేశాం. తర్వాత చేయబోయే బాలయ్యగారి సినిమా మాస్. సినిమాకి సినిమాకి డిఫరెన్స్ చూపించుకుంటూ వెళితే ఫస్ట్ మనం బోర్ కొట్టం. మార్కెట్ లో ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేదాని చెక్ చేసుకున్నట్లయితే ఫ్లాప్ అవ్వాకుండా బయటపడవచ్చు'' అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.