విజయాలు సాధించడంలో 'సరిలేరు నీకెవ్వరు'!

By Inkmantra - November 26, 2019 - 18:20 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు ఇండస్ట్రీలోకి డైలాగ్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగి, కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి.

 

తన సినిమాల్లో ఎలాంటి గొప్ప కథ తీసుకోకుండానే.. కేవలం తన శైలి కామెడీ క్యారెక్టరైజేషన్స్ తో, కామెడీ సీన్స్ తోనే సినిమాని హిట్ చెయ్యటం అంటే మాములు విషయం కాదు. పైగా తాను ఇప్పటివరకు చేసిన హీరోలందరూ.. అప్పటికే ప్లాప్ ల్లో సతమతవుతున్న వాళ్ళే. అనిల్ మొదటి సినిమా 'పటాస్' విషయానికి వస్తే.. అప్పటికే జయీభవ, కత్తి, ఓమ్ 3డిలతో వరుస పరాజయాలను ఎదురుకుంటూ కష్టకాలంలో ఉన్న కళ్యాణ్ రామ్ కి పటాస్ తో కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అందించాడు అనిల్.

 

అలాగే మరో యంగ్ హీరో 'సాయి ధరమ్ తేజ్' కెరీర్ స్టార్టింగ్ లోనే రేయ్ లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న టైంలో 'సుప్రీమ్'తో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చి తేజ్ కెరీర్ కే మంచి బూస్టఫ్ ఇచ్చాడు. ఇక అనిల్ మూడో సినిమా 'రాజా ది గ్రేట్'. బెంగాల్ టైగర్, కిక్ 2 లతో ప్లాప్ ల్లో ఉన్న రవితేజ్ ను బ్లైండ్ క్యారెక్టర్ లో చూపించి.. మాస్ మహారాజాకి సాలిడ్ హిట్ ఇచ్చాడు.

 

అదేవిధంగా హిట్ వచ్చి చాలా కాలం అయిన వెంకీకి 'ఎఫ్ 2' రూపంలో కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. మొత్తానికి ప్లాప్ ల్లో ఉన్నవాళ్ళందరికీ కరెక్ట్ టైంలో హిట్లు ఇస్తోన్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి గుర్తింపు రావడం నిజంగా విశేషమే. అయితే అనిల్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా సూపర్ హిట్ గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ కు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. మొత్తానికి విజయాలు సాధించడంలో అనిల్.. నీకు సరిలేరు ఎవ్వరూ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS