'ఎఫ్ 2' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన 'అసురన్' సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త సీన్స్ ను రాస్తున్నారట.
వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గా సాగిన.. ఆ సీరియస్ నెస్ లో వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా చేయాలని మేకర్స్ ను సురేష్ బాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక వెట్రిమారన్ తెరకెక్కించ ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. వెంకటేష్ నటిస్తున్న చిత్రం 'వెంకీ మామ'. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.