కొలెవరీ బుల్లోడు సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. వై దిస్ కొలెవర్రీ అంటూ వచ్చిన ఆ పాటతో ఈ బుల్లోడు తమిళంలోనే కాదు అందర్నీ ఎట్రాక్ట్ చేసేశాడు. ఆ పాట వచ్చిన కొత్తల్లో అందరికీ కొలెవరీ పిచ్చెక్కించేశాడు. ముసలాడు దగ్గర్నించీ, పసి వాడి దాకా ఎక్కడ విన్నా వై దిస్ కొలవెర్రీనే.. ఆ కొలెవర్రీ బుల్లోడ్ని మర్చిపోలేం కదా. అదేనండీ యంగ్ అండ్ ఎనర్జిటిక్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా కోసం. తొలిసారిగా అనిరుధ్ తెలుగులోకి ఎంటర్ అవుతున్నాడు ఈ సినిమాతో. పవన్ కోసం ఈ బుల్లోడు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట. పవన్ సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలా అనిరుధ్ తన టాలెంట్‌తో డిఫరెంట్ అండ్ బ్రైట్ ఫుల్ మ్యూజిక్‌ని సిద్ధం చేస్తున్నాడట. తొలిసారి తెలుగులో చేయబోతున్నా చిత్రమే కాకుండా, పవన్ కళ్యాన్ సినిమా కూడా కావడంతో ఈ సినిమాని అనిరుధ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడట. అనిరుధ్ నుండి ఈ ఏడాది నాలుగు చిత్రాలు రానున్నాయి. తమిళంలో మూడు చిత్రాలు కాగా, తెలుగులో పవన్ చిత్రం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. ఈ సినిమాపై ముందు నుంచే భారీగా అంచనాలున్నాయి.