సత్యభామ పేరులోనే పవర్ ఉంది. ఆ పాత్రని ఎవ్వరు పోషించినా ఏదో తెలీని హుందాతనం వచ్చేస్తుంది వారిలో. అలాంటి పాత్రనే ఇప్పుడు 'పెళ్లిచూపులు' భామ పోషిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'కేశవ'. ఈ సినిమాలో రీతూ వర్మ పోషిస్తోన్న పాత్ర పేరు సత్యభామ. లా స్టూడెంట్‌గా నటిస్తోంది. మంచి వాళ్లకు అండగా నిలిచే పాత్ర అది. అలాంటి అమ్మాయికి మర్డర్స్ చేసే హీరో దొరికితే ఏం చేస్తుంది. ఆతని మోటో ఏంటో తెలుసుకుని అతనికి కూడా అండగా నిలుస్తుంది. అయితే ఈ సత్యభామ చాలా పవర్‌ఫుల్ అట. గ్లామర్‌తో పాటు, ప్రాధాన్యం ఉన్న పాత్రట. రివేంజ్ డ్రామాగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. అమ్మడికి 'పెళ్లిచూపులు' తెచ్చిపెట్టిన పాపులారిటీ ఏ పాటిదో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. నటనలో ఆరిందానే ఈ ముద్దుగుమ్మ. సో ఎలాంటి పాత్రైనా ఈజీగా టేకప్ చేసేయగలదు. తమిళంలో కూడా అమ్మడు అవకాశాలు బాగానే దక్కించుకుంటోంది. బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ పాపకి తెలుగంటే అభిమానం. తెలుగు సినిమాల పైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ చేస్తానంటోంది. కానీ అవకాశం వస్తే ఎక్కడా వదిలి పెట్టనంటోంది. అమ్మడి దగ్గర ఉన్న మరో వెసులుబాటు ఏంటంటే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందమైన, నిండైన తెలుగందం ఆమె సొంతం.