దగ్గుబాటి వారసుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రానా హీరో అర్థాన్ని మార్చేశారు. కేవలం హీరోయిజం చూపించే పాత్రలే కాకుండా నటనకి ఆస్కారమున్న ఏ పాత్ర అయినా నటించటానికి ముందుకువస్తాడు. తన నటనతో ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు. అందుకే కెరియర్ మొదటి నుంచి పానిండియా హీరోగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని భాషల్లో నటించాడు. హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా, యాంకర్ గా విభిన్న ప్రయాణం చేస్తున్న రానా, అనిరుద్ లాంటి విస్ఫోటనాన్ని కలిస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనే ఫాన్స్ కి మంచి హుషారు ఇస్తుంది. అవును ఈ మధ్య అనిరుద్, రానా కలిసి ఉన్న ఫొటోస్ దర్శనం ఇవ్వటం తో ఫాన్స్ ఈ కాంబో పై ఆసక్తిగా ఉన్నారు.
కానీ వీరిద్దరూ కలిసింది సినిమా కోసం కాదని , ఒక బిజినెస్ కోసం అని తెలిసి ఉస్సురుమన్నారు. అవును రానా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్, హర్ష వడ్లమూడితో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారట. రానా అనిరుద్ కలిసి సినిమా చేయకపోయినా వీరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా కలిసి బిజినెస్ చేసేందుకు రెడీ అయ్యారు. మెక్సికోలో 'లోకా లోకా టెకీలా' డ్రింక్ తయారీ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా వాటిని మార్కెట్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ టెకీలా బ్రాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే డ్రింక్ ని ఇండియాలోకి తెచ్చేందుకు రానా, అనిరుద్ రెడీ అయ్యారు.
ఇందుకోసం వారు మెక్సికో లోని టెకీలా డ్రింక్ తయారీ ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ వారితో ముచ్చటించి నట్లు, అక్కడి ఫామ్ లో దీని ఎలా చేస్తారో స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. 'అగావె మొక్కలని' కట్ చేసి టెకీలాని ఎలా తయారు చేస్తారనేది వీరు తెలుసుకున్నారట. పంటలని సాగు చేసే విధానం, ఆ మొక్క కాండంతో ప్యూర్ టెకీలాని ఎలా తయారు చేస్తారన్న విషయాలు తెలుసుకున్నామని వారు తెలిపారు. మెక్సికోలోని లోకా కోలా టెకీలా డిస్టిలరీ సెంటర్ లో టూర్ మరుపురాని అనుభూతిని ఇచ్చిందని రానా ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. అక్కడ ఫామ్ లో రైతులతో కలిసి దిగిన ఫోటోని కూడా రానా ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. త్వరలో వీరిద్దరూ ఈ డ్రింక్ ని ఇండియన్స్ కి రుచి చూపనున్నారు.