ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రానికి సంబందించిన ఒక్కొక విషయం ప్రేక్షకుల్లో ఈ చిత్రం పైన అంచనాలని పదింతలు చేస్తున్నది.
అందుతున్న తాజా సమాచారం ప్రకారం, తమిళ సంగీత దర్శకుడైన అనిరుద్ రవిచందర్, ఎన్టీఆర్-త్రివిక్రమ్ చేయబోయే చిత్రానికి సంగీతం ఇవ్వనున్నాడట. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో అనిరుద్ కి పెద్ద ఫాలోయింగ్ ఉండగా తాజాగా త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ చిత్రానికి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
పైగా అనిరుద్ కూడా తాను తెలుగులో రాబోయే కాలంలో సినిమాలు చేయాలనుకుంట్టునట్టు చెప్పడంతో అతను తరువాత ఏ చిత్రం చేయనున్నాడో అన్న సస్పెన్స్ కి ఈ వార్తతో సమాధానం దొరికిపోయింది.
మొత్తానికి.. ఎన్టీఆర్-అనిరుద్ కలయికలో ఒక మ్యూజికల్ హిట్ రాబోతున్నదనమాట.