వావ్‌ వాట్‌ ఏ గ్లామర్‌ అంజలి పాప

By iQlikMovies - May 10, 2018 - 18:07 PM IST

మరిన్ని వార్తలు

ఈ పిక్‌ చూస్తే వారెవ్వా వాట్‌ ఏ గ్లామర్‌. ఎవరీ కొత్త భామ అనాలనిపిస్తోంది కదా. అయితే తప్పులో కాలేసినట్లే. ఈ భామ కొత్త భామ అసలే కాదు. అందరికీ సుపరిచితురాలు. పదహారణాల తెలుగమ్మాయి. అంజలి పాప. తెలుగులో చెప్పుకోదగ్గ స్టార్‌డమ్‌ లేకపోయినప్పటికీ, కోలీవుడ్‌లో మాత్రం స్టార్‌ హీరోయిన్స్‌లో అంజలిని ముందు వరుసలోనే ఉంచేయొచ్చు. అయితే ఏంటి అంజలిలో ఈ కొత్త గ్లామర్‌ అనుకుంటున్నారు కదా. అవును ఈ మధ్య అంజలి పాప వర్కవుట్స్‌ చేసి, బరువు బాగా తగ్గింది. ఫిజిక్‌ని బాగా కంట్రోల్‌ చేసి, ఇదిగో ఇంతందంగా తయారైంది. అందుకే ఎంత సక్కగున్నావే అంజలి.. ఈ ఫోటోలో అనకుండా ఉండలేకపోతున్నాం కదా. అంతేకాదు, ఈ అందాల భామ కాస్త ట్రాక్‌ కూడా మార్చిందనే చెప్పాలి. ఇంతవరకూ ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌లో నటించి, పక్కింటమ్మాయిలా కనిపించిన అంజలి ఇకపై గ్లామరస్‌ పాత్రలకు సై అనబోతోందని తెలుస్తోంది. అందుకు శాంపిలే ఈ ఫోటో. ఏమాటకామాటే చెప్పుకోవాలి గ్లామరస్‌ లుక్‌లోనూ అంజలి సింప్లీ సూపర్బ్‌హే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS