మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కాలం తరువాత ఒక హిందీ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ లో తన చిత్రాల గురించి, వ్యక్తిగత విషయాలని పంచుకున్నాడు.
అందులో భాగంగానే ఆ విలేకరి మరి పిల్లల గురించి ఆలోచిస్తున్నారా అని అడగగా- హా.. తప్పకుండా.. అతి త్వరలోనే మీరు ఆ విషయం వినొచ్చు అని చెప్పాడు. దీనితో కొణిదెల కుటుంబానికి వారసత్వంగా ఒక చంటి బిడ్డ ఇంకొక సంవత్సర కాలంలో రానున్నట్టుగా ఆయన చెప్పిన సమాధానం బట్టి అర్ధమవుతుంది.
ఈ వార్త నిజంగా మెగా అభిమానుల్లో కచ్చితంగా ఆనందాన్ని నింపే అంశం అని చెప్పొచ్చు. అయితే ఇంతకముందు కూడా ఇదే అంశాన్ని చరణ్ భార్య ఉపాసన దగ్గర చాలా మంది ప్రస్తావించగా- పిల్లలు అనేది చాలా పెద్ద బాధ్యత అని అందుకనే అది సరైన సమయంలోనే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పింది.
ఇక ఇప్పుడు ఆ తరుణం వచ్చినట్టుగా అనుకోవచ్చు.. ఏదేమైనా మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఒక పెద్ద వార్త ఇది అని చెప్పొచ్చు.