పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో 'పింక్' రీమేక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌లో తాప్సీతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కీలక పాత్రలు పోషించారు. ఆ పాత్రల్లో నటించేందుకు తెలుగులో ఇద్దరమ్మాయిల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు నివేదా థామస్ కాగా, మరో ముద్దుగుమ్మ అంజలి అని తెలుస్తోంది. ఇప్పటికే అంజలి 'నిశ్శబ్ధం' సినిమాలో పోలీసాఫీససర్‌గా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు, తాజా ఆఫర్ కూడా అరుదైన ఆఫరే అని చెప్పాలి.
పల్లెటూరి నుండి వచ్చిన ముగ్గురమ్మాయిలు సిటీలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకు సాగిస్తుండగా, వారిపై అనూహ్యంగా రేప్ అటెంప్ట్ జరుగుతుంది. ఆ దుశ్చర్యకు పాల్పడింది ఆ సిటీలో ఉన్న ఓ పాపులర్ ఫిగర్ కావడంతో, ఈ ముగ్గురమ్మాయిలపై జరిగిన అకృత్యానికి ఆధారాల్లేకుండా పోతాయి. కానీ, ఆ ముగ్గురు అమ్మాయిలూ తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించేందుకు సిద్ధపడతారు. న్యాయం కోసం పోరాటం సాగిస్తారు. వారి న్యాయ పోరాటంలో ఓ మేల్ క్యారెక్టర్ అండగా నిలుస్తుంది. హిందీలో ఈ క్యారెక్టర్‌లో అమితాబ్ బచ్చన్ కనిపించగా, తెలుగులో ఆ పాత్రలోనే పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఇక లీడ్ ఫిమేల్ రోల్ పోషించే లేడీ క్యారెక్టర్ విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. మొదట్లో పూజా హెగ్దే ఈ పాత్ర పోషించనుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు అక్కినేని కోడలు సమంత ఆ పాత్ర పోషించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.