గ్లామ్‌షాట్‌: బ్యాక్‌ చూపించింది అందాల 'పంజా' విసిరింది!

By iQlikMovies - May 06, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'పంజా' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ అంజలీ లవనియా. ఫస్ట్‌ అప్పీల్‌కే ఈ బ్యూటీ వావ్‌ అనిపించింది. తన హాట్‌ హాట్‌ అందాలతో కుర్రకారును కచకచలాడించేసింది. అయితే ఆ తర్వాత అంతగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా అమ్మడు అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే మోడలింగ్‌ రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ, సినిమాల్లో సత్తా చాటలేకపోవడంతో, మళ్లీ మోడలింగ్‌ వైపే మెగ్గు చూపింది. ప్రస్తుతం అక్కడ బిజీగా గడుపుతోంది.

 

అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన అందచందాలను ప్రేక్షకులకు గుర్తు చేస్తుంటుంది. తాజా పిక్‌ విషయానికొస్తే, ఇదిగో ఇలా కనిపించి, బ్యాక్‌ హాట్‌ పోజుతో కెవ్వుకేక పుట్టించింది. ఈ పోజులో అమ్మడిని చూస్తుంటే, అరెరె ఇంతందాన్ని మన టాలీవుడ్‌ మిస్‌ అవుతోందే అనిపించక తప్పదు. కానీ మన దర్శక, నిర్మాతలు ఎందుకో ఈ హాట్‌ హాట్‌ అందాల వైపు అస్సలు చూపే విసరడం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS