సియాటెల్‌ నుండి 'మహా' క్రైమ్‌ డిటెక్టివ్‌ రిపోర్ట్‌.!

మరిన్ని వార్తలు

ఎవరీ 'మహా' అనుకుంటున్నారా.? వివరాల్లోకి వెళ్లిపోదాం. 'నిశ్శబ్దం' సినిమాలోని ఓ క్యారెక్టర్‌ పేరు 'మహా'. ఈ పాత్ర పోషించేదెవరో తెలుసా? మన తెలుగమ్మాయి అంజలి. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంజలి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్‌ తాజాగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది. లుక్‌ కిర్రాక్‌ ఉంది. ఓ పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో అంజలి నటిస్తోంది. ఆమె పేరే 'మహా'.

 

క్రైమ్‌ డిటెక్టివ్‌. ప్యాంట్‌, షర్టు ధరించి చేతిలో గన్‌తో, కళ్లకు బ్లాక్‌ కలర్‌ గాగుల్స్‌ ధరించి స్టైల్‌గా నిలబడిన స్టిల్‌ ఇది. ''మహా' క్రైమ్‌ డిటెక్టివ్‌ ఫ్రమ్‌ సియాటెల్‌..' అంటూ ఈ లుక్‌ రిలీజ్‌ చేశారు. చలాకీగా, బబ్లీగా కనిపించే అంజలి పవర్‌ ఫుల్‌ లుక్స్‌లో స్పెషల్‌గా కనిపిస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అనుష్క మ్యూట్‌ ఆర్టిస్ట్‌ సాక్షి పాత్రలో నటిస్తోంది. ముద్దుగుమ్మ షాలినీ పాండే మరో కీలక పాత్రలో కనిపించనుంది.

 

తమిళ నటుడు మాధవన్‌ హీరోగా నటిస్తున్నాడు. మ్యుజీషియన్‌ పాత్రలో మాధవన్‌ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక షాలినీ లుక్‌ పరిచయం కావల్సి ఉంది. ఎక్కువ భాగం ఈ సినిమా అమెరికాలోనే షూటింగ్‌ జరుపుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS