బిగ్‌బాస్‌: ఫినాలే కన్‌ఫ్యూజన్‌ వీడలేదా?

By Inkmantra - October 31, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు బిగ్‌ రియాల్టీ షో ఫినాలేని చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట బిగ్‌బాస్‌ టీమ్‌. గత 100 రోజులుగా ప్రేక్షకుల్ని అలరించడంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన బిగ్‌బాస్‌ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ని గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారట. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న బిగ్‌బాస్‌ ఫినాలే కోసం రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారట. గత సీజన్‌ ఫినాలేకి వెంకటేష్‌ని చీఫ్‌ గెస్ట్‌గా తీసుకొచ్చారు. కానీ, ఆ ఫినాలే ఎపిసోడ్‌ ఏమంత హైలైట్‌ కాలేదు. ఇంతన్నాడు, అంతన్నాడు బిగ్‌బాస్‌ గంగరాజు.. తుస్సుమని తేల్చేశాడు.. అంటూ అప్పుడే వీక్షకులు పెదవి విరిచేశారు. అలాంటిది, అసలే ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ టీఆర్‌పీ రేటింగ్స్‌కి పేద్ద హోల్‌ పెట్టేసింది.

 

ఇక సివరాఖరి ఎపిసోడ్‌తోనైనా లేపాలని అనుకుంటున్నారట. మెగాస్టార్‌ చిరు చేతుల మీదుగా ఈ ఫినాలే ఎపిసోడ్‌కి శుభం కార్డు వేద్దామనుకుంటున్నారట. కానీ, ఆ విషయంలో ఇంకా కన్‌ఫ్యూజన్‌ తీరలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఫినాలేకి సరికొత్త గ్లామర్‌ అద్దబోతున్నారని తెలుస్తోంది. హీరోయిన్లతో ఈ ఎపిసోడ్‌ని రంగుల మయం చేయాలనుకుంటున్నారట. వారిలో హాట్‌ భామ నిధి అగర్వాల్‌ పేరు వినిపిస్తోంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రమోషన్స్‌లో భాగంగా, బిగ్‌బాస్‌ సెట్‌పై నిధి అగర్వాల్‌ చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు.

 

ఇప్పుడు కూడా అంతకు మించి రచ్చ చేయబోతోందట. అలాగే, మరో హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా ఈ ఫినాలేని హీటెక్కించే లేడీస్‌తో హాట్‌ హాట్‌గా ఎండ్‌ చేయబోతున్నారట. ఎలాగూ ఈ సీజన్‌ టైటిల్‌ లేడీస్‌దే అంటున్నారు. ఇక్కడ మాత్రం కన్‌ఫ్యూజన్‌ లేకుండా ఒకే ఒక్క లేడీని హౌస్‌లో ఉంచారు. మరి ఉన్న ఆ లేడీ (శ్రీముఖి)దే బిగ్‌బాస్‌ టైటిలా.? జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ ఫర్‌ త్రీ డేస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS