హీరోయిన్ అంకిత గుర్తుందిగా అదే రస్నా యాడ్ తో పాపులర్ అయి తరువాత ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో కూడా మెరిసింది.
కొద్దికాలం క్రిందట నటనకి గుడ్ బై చెప్పేసి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి స్థిరపడింది. ఇక కొద్దిరోజుల క్రితం ఈమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది, ఆ బాబుకి నీల్ అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని తనే స్వయంగా అభిమానులతో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇప్పుడు ఆ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఒకప్పట్టి హీరోయిన్లు ఇప్పుడు సినిమాల్లో ముఖ్యపాత్రలు చేస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో అంకిత కూడా త్వరలో చేరనుందో లేదో తెలియాలి.