మెగా ఛాన్స్‌: రత్తాలూ 2.0 ఇది నిజమేనా.?

మరిన్ని వార్తలు

రత్తాలు సాంగ్‌తో పాపులర్‌ అయిన లక్ష్మీరాయ్‌కి గతంలో చెప్పుకోదగ్గ హిట్స్‌ లేవు. తెరంగేట్రం చేసి చాలా కాలమే అయినా, కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలంటే 'కాంచన' తర్వాత చిరంజీవితో 'ఖైదీ నెం 150'లో రత్తాలూ.. ఐటెం సాంగే. అంతకు ముందు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో 'తోబా తోబా..' సాంగ్‌ కూడా ఫర్వాలేదనిపించింది.

 

రత్తాలూ ఐటెం సాంగ్‌లో చిరంజీవితో లక్ష్మీరాయ్‌ గ్రేస్‌ చక్కగా మ్యాచ్‌ అయ్యింది. సో మరోసారి రత్తాలుకి చిరంజీవి ఆఫర్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే మరోసారి రత్తాలుకు పండగే. కొరటాల శివ - చిరంజీవి కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌ పూర్తయిపోగానే, కొరటాలతో సినిమా కోసం చిరంజీవి సంసిద్ధం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగవంతమయ్యాయి. హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ పేరు పరిశీలనలో ఉంది.

 

ఐటెం సాంగ్‌ కోసం రత్తాలును ఓకే చేసే యోచనలో ఉన్నట్లు తాజాగా సమాచారం అందుతోంది. ఈ సినిమాని కూడా రామ్‌చరణే నిర్మించే అవకాశాలున్నాయి. మరో ప్రముఖ బ్యానర్‌తో కలిసి రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మించనున్నాడట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS