లక్కు తోక తొక్కిన బ్యూటీ

మరిన్ని వార్తలు


ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది అను ఇమ్మాన్యుయేల్‌. ఈ సినిమాలో ఆఫర్‌ రావడం తన అదృష్టమంటోంది ఈ బ్యూటీ. 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్‌, రాజ్‌తరుణ్‌ సరసన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో నటించిన సంగతి తెలిసినదే. రెండు సినిమాలతోనే అమ్మడి దశ తిరిగేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీని అదృష్టం వరించింది. ఏకంగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది. పవన్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు, అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా నటిస్తోంది. ఇంతటితో అమ్మడు అదృష్టం ఆగిపోలేదు. లేటెస్ట్‌గా ఈ బ్యూటీని ఇంకోసారి లక్కు అక్కున చేర్చుకుందని అనుకోవాలి. సక్సెస్‌ల మీద సక్సెస్‌లతో దూసుకెళ్తున్న బన్నీతో అనూకి ఛాన్స్‌ అవచ్చేందంటే, చిన్న విషయం కాదు. అను ఇమ్మాన్యుయేల్‌ స్టార్‌డమ్‌ ఈ ఆఫర్‌తో ఇంకా పెరిగినట్లే అని చెప్పొచ్చు. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమా. ఇలా వరుస పెట్టి భారీ ఆపర్లు కొట్టేస్తున్న ఈ బ్యూటీ కెరీర్‌లో ఇంకెన్ని సక్సెస్‌ దారులు పలకరిస్తాయో చూడాలిక. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ గోపీచంద్‌తో 'ఆక్సిజన్‌' సినిమాలోనూ నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS