ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ తొలి సినిమా 'మజ్ను'తో మంచి హిట్ అందుకుని, డెబ్యూ బ్యూటీగా డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేసింది. కానీ తర్వాత తర్వాత ఐరెన్ లెగ్ అని ముద్ర వేయించుకుంటూ వచ్చింది. క్రేజ్ సంపాదించింది కానీ, ఆ క్రేజ్ ఈ ముద్దుగుమ్మ విషయంలో ఎన్నాళ్లో ఆగలేదు. సంపాదించిన క్రేజ్ అంతా విమర్శల పాలైంది మెల్లమెల్లగా.
ఇకపోతే, ఈమె నటించిన సినిమాలు వరుసగా నిరాశపరచడంతో, అమ్మడిపై విమర్శల జల్లు పోటెత్తింది. తొలి సినిమా హిట్ నాని ఖాతాలో పడిపోతే, ఆ తర్వాత నుండీ అసలు సిసలు అగ్ని పరీక్షే ప్రతీ సినిమాకి. 'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్ అనూపై చాలా ఎక్కువ ప్రభావం చూపించగా, లేటెస్టుగా వచ్చిన 'నా పేరు సూర్య' సినిమా కూడా ఆ ఎఫెక్ట్‌కి ఆద్యం పోసింది. యాక్టింగ్ రాదు, డల్ ఫేస్.. డాన్స్ రాదు, ఎనర్జీలెస్ అనే రకరకాల కామెంట్స్ ఈమెని వెంటాడుతున్నాయట. రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా నుండి తప్పుకోవడమనే కారణం అనూకి మరో మైనస్ పాయింట్ అయ్యింది.
నిజంగా తన పర్సనల్ ప్రాబ్లెమ్ వల్లే అనూ ఈ సినిమా నుండి తప్పుకున్నా, దాన్ని మరోదానికి ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తాం అనూ టైం బ్యాడ్ అంతేమరి. ఇకపోతే ఈ కామెంట్స్‌ని అనూ సీరియస్‌గా తీసుకుందట. కొంచెం గ్యాప్ తీసుకుని, నటనలో ప్రత్యేక శిక్షణ దిశగా పరుగులు పెడుతోందట. అలాగే డాన్సులో కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోందనీ సమాచారమ్. అంటే త్వరలోనే యాక్టింగ్‌లోనూ, డాన్సుల్లోనూ పరిణీతి చెందిన అనూని చూడబోతున్నామని తెలుస్తోందీ పరిణామంతో.
ప్రస్తుతం అనూ చేతిలో చైతూతో నటిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ఒక్కటే ఉంది.