సూపర్ స్టార్ మహేష్ బాబుకి 25వ చిత్రం పెద్ద తలనొప్పిగా తయారయింది. కారణం ఏంటంటే- ఆ సినిమా నిర్మాణం PVP సినిమాలో చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆ చిత్రం దిల్ రాజ్-అశ్వినిదత్ నిర్మాణంలో జరగనుంది. దీనికి కారణాలు తెలియకపోయినా ఇదొక సంచలనంగా మారింది.
ఈ సమయంలో ఇదే అంశం పైన PVP సంస్థ వారు గతంలోనే ఈ సినిమా పైన స్టే ఇవ్వాల్సిందిగా కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఈ అభ్యర్ధనని పరిశీలించి సినిమా నిర్మాణం పైన స్టే కి ఆదేశాలు జారీ చేసింది. దీనితో కథ మళ్ళీ మొదటికొచ్చింది.
ఇక ఈ అంశాన్ని కోర్టు బయట తేల్చుకునేందుకు ఈ ఇద్దరు బడా నిర్మాతలు రంగంలోకి దిగారు అంటూ ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.
ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం అయి సినిమా సజావుగా సాగాలని కోరుకుందాము.