రెడ్‌ హాట్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌

మరిన్ని వార్తలు

బ్రైట్‌ కలర్‌ రెడ్‌ గౌనులో హాట్‌ హాట్‌గా అందాలారబోసేస్తున్న ఈ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆక్సిజన్‌' సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఈ బ్యూటీ ఇంత హాట్‌గా రెడీ అయ్యి వచ్చింది. కెమెరా కళ్లు చూపు తిప్పుకోకుండా, మొత్తం ఫోకస్‌ ఆమె పైనే ఉంచేలా చేసింది. అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇంతవరకూ చేసిన గ్లామర్‌ ప్రదర్శన ఒకెత్తు. ఈ సినిమాలో మరో ఎత్తు. ఫుల్‌ డోస్‌లో అందాల ఆరబోసేసిందట. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్‌ చూస్తుంటేనే ఆ విషయం తెలుస్తోంది. అమ్మో అనూ ఇది నువ్వేనా? మరీ ఇంత హాట్‌గానా? అంటున్నారు అభిమానులు. అలాగే ఆడియో ఫంక్షన్‌కీ అదే హాట్‌ అప్పీల్‌ని కంటిన్యూ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇంకా ఇదేముంది. సినిమాలో ఉంది అసలు హాట్‌నెస్‌ అరటోంది ఈ బ్యూటీ. ఈ సినిమా కాక పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ సినిమాలోనూ అమ్మడి గ్లామరే మెయిన్‌ అట్రాక్షన్‌ కానుందట. హా ! అదీ సంగతి !


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS