ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి తమిళంలో క్రేజీ ఆఫర్ దక్కిన సంగతి తెలిసిందే. తమిళ ప్రముఖ హీరో, సూపర్‌స్టార్ అల్లుడు ధనుష్ నిర్మాణంలో ఆల్రెడీ పలు చిత్రాలు రూపొందాయి. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి త్వరలో ప్రేక్షకులను అలరించనుంది.
ఇదో భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ హీరోగా నటిస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారమ్. టాలీవుడ్‌లో అనూ వరుసపెట్టి క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నా, ఎందుకో ఆమెకు ఏదీ కలిసి రావడం లేదు. స్టార్ హీరోలు సైతం ఆమెని ఆదుకోలేకపోయారు. ఇప్పుడు తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
ఆల్రెడీ తమిళ తంబీలకు అనూ ఇమ్మాన్యుయేల్ సుపరిచితురాలే. విశాల్‌తో 'తుప్పరివాలన్' సినిమాలో నటించింది. 'డిటెక్టివ్' పేరుతో ఆ సినిమా తెలుగులో విడుదలైంది. ఈ సినిమాలో అనూ పర్‌ఫామెన్స్ తమిళ తంబీలను బాగానే ఇంప్రెస్ చేసింది కూడా. ఇకపోతే తాజా సినిమాలో అనూ పాత్రను ఇంకా బాగా డిజైన్ చేస్తున్నాడట హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన ధనుష్.
ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్‌కి అవకాశం దక్కిందంటే అది నిజంగా అదృష్టమే అని చెప్పాలి. అయితే ఈ అరుదైన అవకాశాన్ని అను ఎంతమేర సద్వినియోగం చేసుకుంటుందో చూడాలిక.