రామ్ చరణ్ 'రంగస్థలం 1985' చిత్రం షూటింగ్ వచ్చే నెలతో ముగియనుండగా ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ఆయన కనిపించనున్నారు.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీనితో రామ్ చరణ్ సరసన మూడు సినిమాలు చేసిన హీరోయిన్ గా క్రెడిట్ కొట్టేసింది అన్న వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అన్నది తాజా సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ అను ఇమ్మాన్యుల్ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే గనుక ఫైనల్ అయితే బాబాయ్ తో చేసిన వెంటనే అబ్బాయి తో చేసిన మెగా హీరోయిన్ గా పేరు తెచ్చేసుకున్నట్టే.
అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి అజ్ఞాతవాసి అవ్వగానే మరో మెగా ఫిల్మ్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది అను.