ఈమధ్య కాలంలో మన దేశానికి అమెరికా నుండి ప్రముఖుల రాక ఎక్కువైంది. మొన్నటికి మొన్న అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ లో రెండు రోజులు సందడి చేసింది.
ఇది మరువక ముందే, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఇక ఆ సందర్భంలో నటి, AP చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ అయిన పూనం కౌర్ ఆయనని కలిసి APలో నేసిన చేనేతే చీరని బహుమతిగా ఇచ్చింది.
ఇది ఆయన భార్య అయిన మిషెల్ ఒబామా క అందచేయమని కోరింది. ఈ బహుమతి పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసినట్టు పూనం కౌర్ తెలిపింది. ఇక ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
మొత్తానికి ఇక్కడి చేనేత చీర అమెరికా వెళ్ళడం వారం పరిదిలో ఇది రెండో సారి అవ్వడం విశేషం. మొన్న హైదరాబాద్ కి వచ్చిన ఇవాంక కి కూడా గొల్ల భామ చీరని బహుకరించిన సంగతి విదితమే.