తొలి సినిమా 'మజ్ను'తోనే ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేసింది మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత 'ఆక్సిజన్', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తదితర సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి అనూహ్యంగా పవన్‌కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి' సినిమాలో ఛాన్స్ రావడం, ఆ తర్వాత అంతే అనూహ్యంగా ఆమెకు స్టార్డమ్ వచ్చి పడటం జరిగిపోయాయి. ఏదో ప్రత్యేకత లేకపోతే ఆమెకి ఇంతలా స్టార్డమ్ వచ్చేస్తుంది? ఆ ప్రత్యేకత ఇంకేదో కాదు, ఆమెలోని హాట్ అప్పీల్. మోడ్రన్ టచ్‌తో కనిపిస్తుంది, సంప్రదాయ బద్ధంగానూ అనిపిస్తుంది. నాణానికి చెరోవైపు అన్నట్టుగా ఉంటుంది ఆమె గ్లామర్. తెరపై హాట్‌గా కన్పించినా, సంప్రదాయ దుస్తుల్లో కన్పించినా అనూ ఇమ్మాన్యుయేల్ ఆటోమేటిక్‌గా కుర్రకారుని ఎట్రాక్ట్ చేసేస్తుంటుంది. ఇదిగో, ఈ గోల్డెన్ శారీలో అనూ ఇమ్మాన్యుయేల్ సొగసు అదిరిపోయింది కదూ! అందుకే సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా 'గోల్డెన్' చాన్స్‌లు ఆమె వెంటపడుతున్నాయి.