హాట్ భామ అనూ ఇమ్మాన్యుయేల్‌కి హాట్ హాట్ ఆఫర్స్ దక్కినంత ఈజీగా హిట్స్ మాత్రం దక్కడం లేదు. 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ కావడంతో అమ్మడి ఆశలన్నీ ఇప్పుడు బన్నీ పైనే పెట్టుకుంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో బన్నీకి జోడీగా అనూ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇంతవరకూ విడుదలైన ఫస్ట్ రిపోర్ట్స్ సమాచారమ్ ప్రకారం భిన్నమైన టాక్ వినిపిస్తోంది.
కొందరు సినిమా చాలా బాగుందంటున్నారు. మరికొందరు అస్సలేం బాగోలేదని అంటున్నారు. అన్నింటికీ మించి అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సారి కూడా నిరాశపరిచిందనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ టాక్ పూర్తిగా నిజమా? కాదా? అని. ఏది ఏమైనా ఈ సినిమా సక్సెస్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఎంతో కీలకం. ఒక్కోసారి ఫస్ట్ టాక్ నెగిటివ్‌గా వచ్చినా, తర్వాత తర్వాత టాక్ని బట్టి, సినిమా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అల్లు అర్జున్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దర్శకుడు వక్కంతం వంశీ కూడా కథ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.
ప్రమోషన్స్ కూడా బాగా జరిగాయి ఈ సినిమాకి. ప్రీ బిజినెస్‌లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ నటన, డాన్సులు సీనియర్స్ అర్జున్, శరత్‌కుమార్‌ల అప్పియరెన్స్ ఇలా చాలా స్పెషాలిటీస్ ఈ సినిమా సక్సెస్‌కి దారి తీసే పాయింట్స్‌గానే చెప్పుకున్నారు. ఏదేమైనా ఈ రోజు సాయంత్రానికి అసలు రిపోర్ట్ వచ్చేస్తుంది. అప్పుడు గానీ చెప్పలేం 'సూర్య' నిరాశ పరిచాడా? అంచనాల్ని అందుకున్నాడా? అనేది.