యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘18 పేజెస్’ అనే మూవీ ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే, ఈ సినిమా ఈ పాటికి సెట్స్ మీదికి కూడా వెళ్లిపోయేది. కానీ, కరోనా కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. అయినా చిత్ర యూనిట్ సరికొత్త ఆలోచన చేసింది. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఓ వైపు కరోనా బయట విలయ తాండవం చేస్తుంటే, ఈ చిత్ర యూనిట్ మాత్రం మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉంది. అదేంటీ.? కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ ఇంటికే పరిమితమై ఉండాలి కదా.. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఎలా పాల్గొంటున్నారు అనుకుంటున్నారా.? మనోళ్లు టెక్నాలజీని బాగా వాడేస్తున్నారండోయ్. కాలు బయట పెట్టకుండా, ఎవరి ఇంట్లోంచి వారే, వీడియో కాల్స్ ద్వారా సిట్టింగ్ వేసేసారు. అలా మ్యూజిక్ డిస్కషన్ కానిచ్చేస్తున్నారన్న మాట. వావ్ .. వాట్ ఏన్ ఐడియా సర్‌జీ.